calender_icon.png 15 January, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేయి తడిపితేనే ఫైల్ ముందుకు!

03-12-2024 12:00:00 AM

  1. గరిడేపల్లి తహసీల్దార్‌పై ఆరోపణల వెల్లువ 
  2. తండ్రి పేరున ఉన్న భూమిని కూతురు పేర మార్చనన్న తహసీల్దార్!
  3. గర్భిణి అని చూడకుండా సాయంత్రం వరకు కూర్చోబెట్టిన వైనం

హుజూర్ నగర్, డిసెంబర్ 2: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి తహీసల్దార్ కార్యాలయంలో పనులు జరగాలంటే చేతులు తడపాల్సిందేనని, లేదంటే ఫైలు కదలదని ఆరోపణలున్నాయి. భూవివాదాలు, పట్టా మార్పిడులు ఇలా ఏదో ఒక సమస్యపై కార్యాలయానికి వచ్చే వారి నుంచి తహసీల్దార్ ఏదో ఒక కొర్రి పెట్టి పనులను వాయిదా వేసి, చివరకు తను నియమించుకున్న వ్యక్తులను కలిస్తే పనులు అయ్యేలా చేస్తున్నారననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సోమవారం జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనమని తెలుస్తున్నది. కొన్ని రోజుల క్రితం కల్మల చెరువు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆ వ్యక్తి పేరున ఉన్న వ్యవసాయ భూమిని తమ పేరున పట్టా మార్పిడి కోసం కుటుంబ సభ్యులు శనివారం స్లాట్ బుక్ చేసుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఆ రోజున హాజరుకాలేదు.

సోమవారం కార్యాలయానికి వచ్చిన మృతుడి కుమార్తె పేరుపై మార్పిడి (విరాసత్) చేయడం కుదరదని తహసీల్దార్ చెప్పినట్లు తెలుస్తుంది. మృతుడి భార్య పేరున మాత్రమే చేస్తానని, కూతురు పేరున చేయనని కొర్రీ పెట్టినట్టు సమాచారం.

అంతేకాకుండా తాను ఏర్పాటు చేసుకున్న కార్యాలయానికి సంబంధించిన వ్యక్తి ద్వారా డబ్బులు డిమాండ్ చేసిందని, సోమవారం సాయంత్రం వరకు వేచి ఉన్నా రిజిస్ట్రేషన్  చేయకపోగా రీషెడ్యూల్ చేసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. మృతుడి కుమార్తె ఏడు నెలల గర్భిని అని, చాలా దూరం నుంచి వచ్చిందని ప్రాధేయపడినా తహసీల్దార్ వినలేదని తెలిసింది.

చివరకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఓ ఉన్నతాధికారి మందలించడంతో సాయంత్రం పని జరిగిందని తెలియవచ్చింది. రీ షెడ్యూల్  అనేది రైతు తన అవసరానికి అనుగుణంగా చేసుకోవచ్చని ధరణి నిబంధనలో ఉండగా.. తహసీల్దార్ దానిని అతిక్రమించిందని విమర్శలు వస్తున్నాయి. 

గర్భిణి అని కూడా చూడలేదు

మా ఆయన తోడేటి సైదయ్య పేరు మీద ఉన్న పొలాన్ని కొంత నా పేరున, కొంత నా కూతురు యాత మౌనిక పేరున మార్చుకునేందుకు శనివారానికి స్లాట్ బుక్ చేసుకున్నాం. నా కూతురు ఏడు నెలల గర్భిణి కావడంతో ఆరోజు రాలేకపో యాం. సోమవారం ఉదయం 9 గం టలకల్లా తహసీల్దార్ ఆఫీస్‌కు వచ్చాం.

కానీ తహసీల్దార్ మాత్రం క చ్చితంగా రీ షెడ్యూల్ చేసుకోవాల్సిం దే అని చెప్పారు. హుజూర్‌నగర్ ఆర్డీ వో, అదనపు కలెక్టర్‌కు చెప్పినా వినలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్ట ర్‌కు పరిస్థితిని వివరించగా ఆయన ఆదేశాల మేరకు సాయంత్రం ౪ తర్వాత రిజిస్ట్రేషన్ చేసింది. నా కూ తురు గర్భిణి అనే జాలి కూడా లేకుండా సాయంత్రం వరకు మ మ్ములను కార్యాలయంలో ఉంచడం బాధ కలిగించింది.

 తోడేటి మారమ్మ, 

బాధితురాలు కల్మలచెరువు

ఇబ్బందులు రావొద్దని చెప్పా

కల్మలచెరువుకు చెందిన మహిళలు గత నెల 11న స్లాట్ బుక్ చేసుకున్నారు. సోమవారం కార్యాలయానికి రాగా, రీ షెడ్యూల్ చేసుకోమని చెప్పాను. భవిష్యత్‌లో శాఖాపరమైన ఇబ్బందులు రావొద్దన్న కోణంలోనే రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించాను. నేను మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వెళ్లి వచ్చేంతవరకు అక్కడే ఉన్న విషయం నాకు తెలియదు. వచ్చాక వారిని పిలిచి రిజిస్ట్రేషన్ చేశాను. 

తహసీల్దార్, గరిడేపల్లి