28-02-2025 12:32:14 AM
మెట్రో విస్తరణ పనులపై హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఎంజీబీఎస్ నుంచి శం షాబాద్ వరకు ప్రభుత్వం చేపట్టిన మెట్రో విస్తరణ పనులకు సంబ ంధించి ౩ వారాల్లో కౌంటర్లు దాఖ లు చేయాలని ప్రభుత్వంతోపాటు ప్రతివాదులకు హైకోర్టు గురువారం ఆదే శాలిచ్చింది. అనంతరం కేసుపై విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసిం ది.
నాలుగో కారిడార్ నిర్మాణానికి సంబంధించిన పనులను నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అ ధ్యక్షుడు మహమ్మద్ రహీంఖాన్ హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీని పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాధర్మాసనం విచారించింది. మెట్రో విస్తరణ వల్ల పలు చారిత్రాత్మక కట్టడాలపై ప్రభావం పడుతుం దని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.