calender_icon.png 24 January, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్‌ఎస్ విక్రయాలపై కౌంటర్ దాఖలు చేయండి

24-01-2025 02:00:49 AM

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాం తి): శక్తిపానీయాలుగా పేర్కొంటూ తప్పుడు ప్రకటనలతో జరుగుతున్న ఓఆర్‌ఎస్ విక్రయాలపై పూర్తి వివరాలతో ఫిబ్రవరి 28 లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈమేరకు ప్రతివాదులైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో), డ్రగ్స్ కంట్రోలర్, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ, డీజీపీలతోపాటు జాన్సన్ అండ్ జాన్సన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, అమృతాంజన్ హెల్త్‌కేర్ లిమిటెడ్, స్టేఫిట్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ వరల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.

ఓఆర్‌ఎస్ విక్రయాలకు సంబంధిం చి ఏప్రిల్ 8న కేంద్రం, కేంద్ర ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 2022లో హైదరా బాద్‌కు చెందిన డాక్టర్ ఎం శివరంజని హైకోర్టులో పిల్ వేశారు.

దీనిపై తాత్కాలి క ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ జీ రాధారాణిలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తప్పుదా రి పట్టించేలా ప్రకటనలు ఇస్తూ ఓఆర్‌ఎస్ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని పేర్కొన్నా రు. వాస్తవానికి ఇదో రకమైన ఔషధమని, డయేరియాకు వినియోగిస్తుండటం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు.

దీంతో దీన్ని శక్తిపానీయంగా పేర్కొంటూ ఔషధ కంపెనీలు చట్టవిరుద్ధంగా ప్రకటనలిస్తూ విక్రయాలు చేపడుతున్నాయన్నారు. అభ్యంతరకరమైన ప్రకటనలతోపాటు ఓఆర్‌ఎస్ దానిలాగే ఉండే క్యూఆర్‌ఎస్‌ల పేర్లతో లేబుళ్లు లేకుండా చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. ఈ పిటిషన్లో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.