calender_icon.png 15 March, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌంటర్ దాఖలు చేయండి

15-03-2025 12:00:00 AM

నాగారం భూముల కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): భూదాన బోర్డు భూములకు సం బంధించి వివాదాల పరిష్కారానికి భూము ల కేటాయింపు చట్టబద్ధంగా జరిగిందో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ భూముల విషయంలో లావాదేవీలు జరిగినందున అటు ప్రజాప్రయోజనాలను, ఇటు పార్టీల హక్కులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని తెలిపింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెం.18 1, 182ల్లో ఉన్న 50 ఎకరాల భూమికి సంబంధించి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసుపై తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథస్థితి కొనసాగించాలని సూచించిం ది.