12-03-2025 12:00:00 AM
జన్వాడ ఫాంహౌస్‌పై డ్రోన్ కేసులో హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పాలనలో మంత్రి కేటీఆర్ లీజ్‌కు తీసుకున్న జన్వాడ ఫాంహౌస్‌పైకి డ్రోన్‌ను పంపించి, అక్కడి దృశ్యాలు చిత్రీకరించారంటూ నమోదైన కేసుతో పాటు ఎల్బీనగర్ కోర్టులో పెండింగ్‌లో తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలంటూ నాడు ఎంపీగా రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఎలాంటి అనుమతుల్లేకుండా జన్వాడ ఫాంహౌస్‌పై డ్రోన్‌ను పంపించి, అక్కడి దృ శ్యాల చిత్రీకరణ జరిగిందంటూ కానిస్టేబుల్ జి.వెంకటేశ్ ఫిర్యాదు చేయగా, నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై జస్టిస్ కె.ల క్ష్మణ్ మంగళవారం మరోసారి విచారణ చే పట్టారు.
రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్ న్యా యవాది ఎస్.నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. జన్వాడ ఫాం హౌస్ నిషేధిత జాబితాలో లేదని కోర్టుకు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరా వును ఆదేశించారు.
గతంలో నమోదు చేసిన ఐదుగురు సాక్షుల వాంగ్మూలాలను సమర్పించాలని సూచించారు. విచారణను ఈనె ల 19వ తేదీకి వాయిదా వేశారు. అలాగే ఎల్బీనగర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌పైనా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.