25-02-2025 02:18:51 AM
*పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి భూవివాదంలో గతేడాది బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై చేవెళ్ల పీఎస్‌లో కేసు నమో దైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని జీవన్‌రెడ్డి దాఖ లు చేసిన పిటిషన్‌పై పోలీసులు కౌం టర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆ దేశించింది.
తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. ఈ కే సులో ఎఫ్‌ఐర్‌ను క్వాష్ చేయాలని జీవన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా ఇటీవల హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ జీవన్‌రెడ్డితోపాటు ఆయన కుటుం బ సభ్యులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు గడువు కోరడంతో విచారణ వాయిదా పడింది.