calender_icon.png 24 April, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలతో కలిసి పోరాటం

24-04-2025 06:30:26 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్...

నిర్మల్ (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చర్చించి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ప్రజల పక్షాన హామీల అమలకు పోరాటం చేద్దామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ పిలుపునిచ్చారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థానికంగా బలోపేతం చేసి ప్రజల పక్షాన నిలబడదామని కార్యకర్తలు అందరు కూడా కష్టపడి పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నయీమ్ రిజ్వాన్ రవి సోఫీ తదితరులు ఉన్నారు.