calender_icon.png 28 December, 2024 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాడే జానకి

21-12-2024 12:00:00 AM

స్టార్ హీరో సురేశ్ గోపి, కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జేఎస్‌కే). ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జే ఫణీంద్రకుమార్ నిర్మిస్తు న్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక దక్పథ కోణంలో తీసిన సినిమా ఇది. బైజు సందోష్, మాధవ్ సురేశ్ గోపి, దివ్య పిళ్లు, అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇంటెన్స్ కోర్టు డ్రామా గా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ సినిమాలో జానకి పాత్రలో నటిస్తోంది. యధార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకిపై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొందన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా నిర్మించారు. ఈ కేసును వాదించే లాయర్ పాత్రలో సురేశ్ గోపి నటిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.

ఈ చిత్రానికి డీవోపీ: రెనదివ్; సంగీతం: గిరీశ్ నారాయణన్, జిబ్రాన్; ఎడిటర్: సంజిత్ మహమ్మద్; సహ నిర్మాతలు: సేతురామన్, హు మాయున్ అలీ అ హమ్మద్; నిర్మాత: జే ఫ ణీంద్రకుమార్; రచన ప్రవీణ్ నారాయణన్.