- నేడు భారత్, ఇంగ్లండ్ తొలి టీ20
- కళ్లన్నీ మహ్మద్ షమీపైనే
కోల్‌కతా: పొట్టి ఫార్మాట్‌లో చాంపియ న్స్ అయిన టీమిండియా నేడు ఈడెన్ గార్డె న్స్ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆసీస్‌కు టెస్టు సిరీస్ కోల్పోయి న భారత్ ఓటమిని మరిచి పరిమిత ఓవర్ల ఆటకు గేర్‌ను మార్చింది. సూర్యకుమార్ సారధ్యంలోని యువ జట్టు ఇంగ్లీష్ భరతం పట్టేందుకు సిద్ధమయ్యింది. సంవత్సరంన్నర పాటు ఆటకు దూరమైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎలా రాణిస్తాడన్నది ఆసక్తిగా మారింది.
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చివరిసారిగా ఆడిన షమీ గాయం బారీన పడ్డాడు. సర్జరీ అనంతరం కోలుకొని దేశవాలీలో ఆకట్టుకున్న షమీ మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. షమీకి తోడుగా బౌలింగ్‌లో అర్ష్‌దీప్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. స్పిన్నర్లుగా బిష్ణోయి లేదా సుందర్ లేదా వరుణ్‌లో ఒకరు ఆడే అవకాశముంది. ఇక బ్యాటింగ్ విభాగానికి వస్తే అభిషేక్, సంజూ శాంసన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, రింకూ సింగ్‌లతో పటిష్టంగా ఉంది.
ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్, అక్షర్ పటేల్ రాణిస్తే తిరుగుండదు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు అక్షర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లండ్ తొలి టీ20కి ఆడబోయే జట్టును మంగళవారం ప్రకటించింది. జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ ఇస్తుండగా.. మార్క్ వుడ్ , ఆదిల్ రషీద్, జాకబ్ బెతెల్‌లతో బౌలింగ్ పర్వాలేదనిపిస్తోంది. బట్లర్, బ్రూక్, ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టోన్, డకెట్, ఓవర్టన్‌లతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపి స్తోంది.