నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో గీతా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కల్లుగీత రక్షణపై పోరాటం నిర్వహించాలని తెలంగాణ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అమరవీని నర్సా గౌడ్ అన్నారు. శుక్రవారం తిరుమలలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. గీత కార్మికులకు ప్రభుత్వం రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేంద్ర గౌడ్, బాలా గౌడ్, రవీందర్ గౌడ్, దశ గౌడ్, రమా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.