10-03-2025 01:29:21 AM
మహబూబ్ నగర్, మార్చి 9 (విజయ క్రాంతి) : ఎవరెన్ని ఆశలు చూపించిన ఇలాగైనా తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేసినప్పటికీ బీసీ నినాదం కోసం కొట్లాడుతున్నానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీమ్ ఆధ్వర్యంలో క్రౌన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బిసి రాజకీయ చైతన్య సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. పాలమూరు గడ్డపై పుట్టిన సింహం ఎర్ర సత్యంను అగ్రవర్ణకులాలే మట్టు పెట్టాయని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లా వాసులైన డీకే అరుణ, ెున్నం శ్రీనివాస్ రెడ్డి తమ స్వలాభం కోసం ఎన్ని పార్టీలైన మారుతారని విమర్శించారు.
తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు అనే దమ్ముందని, రెడ్డిలకు బిసిల ఓట్లు వద్దనే దమ్ముందా అని ప్రశ్నించారు ? జనాభాలో 60 శాతం వున్న బిసిలకు దామాషా ప్రకారం పదవులు కావాలని, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఎలాంటి ఉద్యమం చేయలేదన్నారు. జనాభాలో 8 శాతం వున్న మీరు మమ్మల్ని పాలిస్తే 2 కోట్ల జనాభా వున్న బీసీలు ఎలాంటి పరిపాలన చేయాలో చేసి చూపిస్తామని పేర్కొన్నారు. పాలమూరు బీసీలు ఎర్ర సత్యమన్న, పండుగ సాయన్న వారసులమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 15 మంది బీసీ నాయకులు అసెంబ్లీలో అడుగుపెట్టాలని సూచించారు. భవిష్యత్తు బీసీలు రాజ్యాధికారంలో ఉండేందుకు అందరు సాయ శక్తులుగా ఒకతటి పైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు తదితరులు ఉన్నారు.