calender_icon.png 4 February, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యలతో పోరాటాలను ఆపలేరు..

04-02-2025 08:00:49 PM

సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): వ్యవసాయ కార్మికుల హక్కుల కొరకు, రైతు పంట గిట్టుబాటు ధరల కొరకు కామ్రేడ్ బద్దం గంగారెడ్డి అనేక పోరాటాలు చేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. జైనథ్ మండలం పెండల్వాడ గ్రామంలో మంగళవారం నిర్వహించిన కామ్రేడ్ బద్దం గంగారెడ్డి 35వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా బద్దం గంగారెడ్డి చిత్రపటంతో గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ మేరకు ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధి కొరకు అనేక ఉద్యమాలు చేసిన గంగారెడ్డి 1987లో పెండలవాడ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవ ఎన్నిక కావడం జరిగిందని గుర్తు చేశారు. పేద ప్రజల కోసం పోరాడుతున్న గంగారెడ్డిని మాటు వేసి హత్య చేయడం జరిగిందని, హత్యలతో ఉద్యమాలు ఆపలేరని స్పష్టం చేశారు. ఆయన చనిపోయి 35 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.