26-04-2025 12:00:00 AM
ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు వీపీ సాను
ఖమ్మంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఐదవ మహాసభలు ప్రారంభం
ఖమ్మం నగర వీధుల్లో ర్యాలీగా కదం తొక్కిన విద్యార్థులు
ఖమ్మం, ఏప్రిల్ 25( విజయక్రాంతి) :-నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా భారత విద్యార్థి ఫెడరేషన్ అలుపెరుగని పో రాటం చేస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను తెలిపారు. హిందూ హిం దుస్తానీ అంటూ కేంద్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకొస్తుందని అన్నా రు. బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన విద్యార్థి నేతలను విద్యాలయాల నుంచి స స్పెన్షన్ చేస్తుందన్నారు.
వేలాది మంది కోసం పోరాడేవాడే నిజమైన హీరో అని సి నీ నటుడు, అభ్యుదయవాది డాక్టర్ మాదా ల రవి అన్నారు. ఖమ్మంలో మూడు రోజులపాటు కొనసాగే ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఐదవ మహాసభలు స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రం (సీతారాం ఏచూరి నగర్)లో యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్. మూర్తి అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమయ్యాయి.
దీనికి ముందు కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వీపీ సాను మాట్లాడారు. కాశ్మీర్లో పర్యాటకులపై దాడికి భద్రత వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. పార్లమెంటు మొదలు పుల్వామా వరకు అనేక చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయని, ప్రధానిగా మోడీ, హోం మినిస్టర్ గా అమిత్ షాకు కొనసాగే అర్హత లేదన్నారు. పెహల్ గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదు లు దాడి చేసి 28 మందిని హతమార్చారంటే ఇది పూర్తిగా భద్రత వైఫల్య మేనన్నారు.
పోరాటాలకు ఏకైక మార్గం చైతన్యం: మాదాల రవి
పోరాటాలకు చైతన్యం ఏకైక మార్గమని సినీ నటుడు, నిర్మాత డాక్టర్ మాదాల రవి అన్నారు. అభ్యుదయ శక్తులు ఐక్యం కావాలని, వామపక్షాలు ఏకం కావాలని పిలు పునిచ్చారు. పోరాటాల ఖిరాటాల ఖమ్మం జిల్లాకు రెడ్ సెల్యూట్ అంటూ ఉపన్యాసాన్ని ప్రారంభించారు. చదువు ఎందుకు? చదువు ఎందుకు? చదువు ఎందుకురా..??? నలుగురిలో దీపమై నిలిచేందుకు రా..! అం టూ ఉర్రూతలూగించారు.
వేలాది మంది కోసం ప్రాణమిచ్చే వాడు నిజమైన హీరో.. దాస్య శృంఖలాల నుంచి దేశానికి విముక్తి కల్పించిన భగత్ సింగ్, ప్రపంచ విప్లవాన్ని ముందుకు నడిపిన చే గువారా... బడుగు జీవుల కోసం పాటుపడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిజమైన హీరోలని వ్యాఖ్యానించారు. విద్యా రంగంతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు అన్నారు.
కొత్త నిర్ణయా లతో పోరాటాలకు వెళ్లాలని ఆహ్వాన సం ఘం వైస్ చైర్మన్ ఐవీ రమణారావు, రిసెప్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు రవిమారుత్ సూచించారు. ఈ బహిరంగ సభలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్, విద్యావేత్తలు మువ్వా శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఎఐ రాష్ట్ర గరల్స్ కన్వీనర్ ఎం.పూజ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం వీధుల్లో కదంతొక్కుతూ ర్యాలీ
ఎస్‌ఎఫ్‌ఐ ఐదవ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఖమ్మం నగర వీధుల్లో విద్యార్థులు కదం తొక్కుతూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జడ్పీ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ వైరా రోడ్ మీదుగా మహాసభల ప్రాంగణం భక్త రామదాసు కళాక్షేత్రం వరకు సాగింది. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి జెండా ఆవిష్కరించటంతో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు.