మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
దండేపల్లి (మంచిర్యాల), జూలై 3 (విజయక్రాంతి): అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలీ భవనంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని సమస్యలపై, చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం దండేపల్లి వైస్ ఎంపీపీ అనిల్ పదవీ కాలం పూర్తవడంతో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నా యకులతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.