calender_icon.png 10 March, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభిస్తే ఆందోళన తప్పదు

10-03-2025 04:42:07 PM

ముత్తారం మాజీ ఎంపీపీ అత్తె చంద్రమౌళి..

ముత్తారం (విజయక్రాంతి): గ్రీన్ పీల్డ్ నేషనల్ హైవే నిర్మానంలో భూములు కోల్పోతున్నా రైతులకు నష్టపరిహరం చెల్లించకుండా పనులు ప్రారంబిస్తే రైతుల పక్షాన పోరాటం తప్పదని ముత్తారం మాజీ ఎంపీపీ అత్తే చంద్రమౌళి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ మండలంలోని లక్కారం, సర్వారం మైదంబండ, పోతారం, కేశనపల్లి, అడవి శ్రీరాంపూర్, ఓడేడ్ శివారులలో హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల వ్యవసాయ బావి, బోర్లకు పైప్ లైన్లకు చేట్లకు నష్టపరిహరం చెల్లించాకే రైతుల భూములలో పనులు చేపట్టాలన్నారు. గతంలో అధికారులకు తేల్చి చేప్పినప్పటికి నష్టపరిహరం పూర్తి స్థాయిలో చెల్లించకుండ మరో లగచర్లను తలపించేల పనులు మొదలు పెట్టి పంటలు ధ్వంసం చేసారని అరోపించారు. పరిహరం చెల్లించకుండా అదికారులు కాని, కాంట్రక్టర్ లు కాని పంట పోలాల్లో పనులు నిర్వహిస్తే రైతులతో అడ్డుకుంటామని మాజీ ఎంపీపీ హెచ్చరించారు.