calender_icon.png 27 November, 2024 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల కోసమే పోరు

06-11-2024 01:42:54 AM

  1. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ కృషి
  2. బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి శ్రీధర్‌బాబు పది ప్రశ్నలు

హైదరాబాద్, నవంబర్ 5 (విజయ క్రాంతి) : దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలు మార్చడానికి నిరంతరం పోరాటం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉద్ఘాటించారు.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేదలు, అణగారిన అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, తమ నేత రాహుల్ గాంధీపైనా బీఆర్‌ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ మంగళవారం బహిరంగ లేఖ ద్వారా పది ప్రశ్నలు సంధించారు. 

1. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1200 మంది విద్యార్థులు, యువకుల కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ ఎందుకు విస్మరించిందో ఇప్పుడైనా జవాబు చెప్పగలరా?

2. 2014 జూన్ 14న సీఎం హోదాలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో 1200 బలిదానాలు జరిగినట్టు కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారు. ఆ తర్వాత అనేక సార్లు మాట మార్చి అమరుల సంఖ్యను 585 కుదిస్తూ వేర్వే రు ఉత్తర్వుల్లో వెల్లడించారు. మిగిలిన 615 మంది ఏమై పోయారో పదేళ్ల విధ్వంస పాలనలో ఎప్పుడైనా ఆత్మ విమర్శ చేసుకున్నారా?

3. ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల నగదు, గృహ వసతి, సాగు భూమి, కుటుంబానికో ఉద్యోగం, ఉచి త విద్య, వైద్యం ఇప్పిస్తామని ఎన్నో హామీలిచ్చారు. కొద్ది మందికి నగదు, ఉద్యోగాలు మినహా ఏ హామీలను నెరవేర్చలేదు. బిడ్డల ను కోల్పోయిన కుటుంబాల గురించి కారు పార్టీ పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు?

4. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం పీఠంపై కూర్చోబెడతామన్న మీరు అసలు ఆ మాటే అనలేదని మాట మార్చింది వాస్త వం కాదా? దళిత కుటుంబాలకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి నీటి మూట అయింది వాస్తవం కాదా?

5. తెలంగాణ తల్లిగా సోనియమ్మను పొగిడిన నోళ్లతోనే మీరు ఆ కుటుంబాన్ని కించపరుస్తున్న విషయం ప్రజలకు తెలియదా. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామ ని మాట తప్పింది ఎవరు? తెలంగాణను ఇచ్చిన సోనియమ్మ, రాహుల్ గాంధీలు అకస్తాత్తుగా శత్రువులు ఎలా అయ్యారు?.

6. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగం అనేది ఉండదు అని ఆశలు కల్పించి మోసం చేసింది మీరు కాదా?.

7. గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకైన సమర్థించుకున్న చరిత్ర ఎవరిది? నోటిఫికేషన్ విడు దల చేసిన మూడేళ్లలో సరిగ్గా పరీక్షలు నిర్వహించలేని అసమర్థత ఎవరిది? న్యాయ స్థానాల జోక్యంతో పరీక్షలు రద్దు చేయాల్సి న పరిస్థితికి మీరు బాధ్యులు కాదా?

8. ఇళ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూం నివాసాలు నిర్మించి ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి పదేళ్లలో మీరు కట్టింది ఎన్ని? పంపిణీ చేసింది ఎన్నో గుండె పై చేయివేసుకుని చెప్పగలరా? కేజీ టు పీజీ విద్య హామీ అసలు మీకు గుర్తుందా?

9. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడు జిల్లాల్లోని 16,40,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని నమ్మబలికారు. మరిలక్ష ఎకరాలైనా సాగులోకి వచ్చిందా? మేడిగడ్డ నిర్మాణ లోపాల గురించి, అంచనా వ్యయం రూ.40 వేల కోట్ల నుంచి రూ.లక్షా40 వేల కోట్లకు పెంచడంలో వాస్తవాలు ప్రజలకు తెలియదనుకుంటున్నారా?

10. మేము నిత్యం ప్రజల్లోనే ఉంటు న్నాం. మా అధినేత రాహుల్ గాంధీ దేశమం తా పర్యటిస్తున్నారు. మరి జనం మధ్యకు వెళ్లంది మీరా, మేమా? అధికారం కోల్సోయాక ఇంటికే పరిమితమై బయటకు రానిది మీ పార్టీ అధినేత కాదా?

రాహుల్ గాంధీని తక్కువ చేసి మాట్లాడితే పెద్దోళ్లమై పోతామని భ్రమపడుతు న్నట్టున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ జాతీయ నేత అని, ఉప ప్రాంతీయ పార్టీగా మారి ఉనికి కోల్పోతున్న రాజకీయ పక్షం నాయకులు మీరని విమర్శించారు.