ఏసీఎఫ్ జంటనగరాల మహాసభలో విమలక్క
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): సమాజం లోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ఏసీఎఫ్) తెలుగు రాష్ట్రాల గౌవరాధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. ఆదివారం కోఠిలోని బీసీసీఈ భవన్‌లో ఏసీఎఫ్ జంటనగరాల మహాసభ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్సూర్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా విమలక్క, హైకోర్టు అడ్వకేట్ కట్టా భగవంత్‌రెడ్డి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ 1974లో ఉస్మానియా యూ నివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నేతృత్వంలో అరుణోదయ ఆవిర్భవించింద న్నారు. 50 ఏండ్లుగా ఎన్నో పోరాటాలు చేస్తూ నిర్బంధాలను ఎదుర్కొందని చెప్పారు. సమాజంలోని దోపిడీ, పీడన, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అమరుల పోరాట స్ఫూ ర్తితో ముందుకు సాగాలని కోరారు.
కట్టా భగవంత్‌రెడ్డి మాట్లాడుతూ నూతన ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించాలని, ప్రజల సంస్కృతిని ముం దుకు తీసుకురావాలని సూచించారు. ఆధిపత్య ధోరణి, అణచివేత, నియం తృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతు న్న దేశాలు మత జాతీయవాదానికి ప్రభావితమవుతున్నాయన్నారు.
ప్రభుత్వాలు సంక్షే మ పథకాలతో పబ్బం గడుపుతున్నాయని, భాష, సెంటిమెంట్, వృత్తుల పేరిట ప్రజలు విడిపోవడం దారుణమన్నారు. అనంతరం 13మంది సభ్యులతో ఏసీఎఫ్ జంటనగరాల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాకేశ్, ఉపాధ్యక్షులుగా హఫీజ్, సంతో ష, ప్రసన్న, ప్రధాన కార్యదర్శిగా సురేశ్, కా ర్యదర్శులుగా సౌజన్య, అరుంధతి, సంగీత, ట్రెజరర్‌గా చైతన్య, కార్యవర్గసభ్యులుగా సిరివల్లి, తేజ, సిరి, గీతిక, నిష, విజయ్ తదిత రులను ఎన్నుకున్నారు.