calender_icon.png 21 December, 2024 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి

16-09-2024 04:20:34 AM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ.అబ్బాస్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 15 (విజయక్రాంతి): దేశంలో మతోన్మాదం, కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించడమే తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నిజమైన నివాళి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పక్షోత్సవాల సందర్భంగా సీపీఎం సౌత్ కమిటీ ఆధ్వర్యంలో శాలిబండ చౌరస్తా నుంచి చార్మినార్ వద్దకు ఆదివారం ర్యాలీ నిర్వహించారు.

అనంతరం జరిగిన సభలో ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయు ధ రైతాంగ పోరాటం ముస్లింలకు, హిందూవులకు మధ్య జరిగింది కాదని.. దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీ విఠల్, ఎం మీనా, పీ నాగేశ్వర్, ఎల్ కోటయ్య, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం శోభన్, పార్టీ నాయకులు లక్ష్మమ్మ, బాలు నాయక్, శ్రావణ్ కుమార్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.