calender_icon.png 7 November, 2024 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేవెళ్లలో 53.15శాతం పోలింగ్

14-05-2024 02:23:39 AM

చేవెళ్ల సెగ్మెంట్‌లో అంతుచిక్కని ఓటర్ నాడి

హోరా హోరిగా సాగిన పోలింగ్

ప్రధానంగా కాంగ్రెస్, వర్సెస్ బీజేపీ మధ్యనే బిగ్ ఫైట్

శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లో వలస ఓటర్ల ఎఫెక్ట్

రంగారెడ్డి, /వికారాబాద్ మే 13( విజయక్రాంతి): చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఓట ర్ నాడి అంతుచిక్కడం లేదు. పార్లమెంట్ పరిధిలో పోలింగ్ మాత్రం హోరా హోరిగా సాగింది. పార్లమెంట్ బరిలో మొత్తం 43 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ గడ్డం రంజిత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ కాసాని జ్ఙానేశ్వర్ ముదిరాజ్, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు బరిలో నిలిచారు. పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఉండగా, వికారాబాద్ జిల్లా పరిధిలో వికారాబాద్, పరిగి, తాండూ రు నియోజకవర్గాలు ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే ఈ దఫా పోలిం గ్ కాస్త తగ్గింది. 2019లో 53.25పోలింగ్ నమోదు కాగా 2024లో 53.15శాతం పోలింగ్ నమోదు అయింది. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు సెటిలర్లు ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికలకు తరలివెల్లడంతో ఆయా నియోజకవ ర్గాల్లో పోలింగ్ శాతంపై కొంత ప్రభావం పడింది.

ద్వీముఖ పోరు..

చేవెళ్ల పార్లమెంగ్ సెగ్మెంట్‌లో పోలింగ్ సరళిని పరిశీలిస్తే ప్రధానంగా ఇరు పార్టీలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్యనే బిగ్ పైట్ కొనసాగగా.. బీఆర్‌ఎస్ మాత్రం మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని సమా చారం. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే టఫ్ పైట్ కొన సాగగా.. తాండూరు నియోజకవర్గంలో మాత్రం ట్రైంగిల్ పోరు సాగింది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితం అయిన బీజేపీ ఈ దఫా గ్రామాలకు సైతం చాపకింద నీరులా పాకింది. యువత, ముఖ్యంగా విద్యావంతులు బీజేపీ వైపు కాస్త మొగ్గుచూపగా.. కాంగ్రెస్‌కు సాంప్రదాయ ఓటు బ్యాంకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఉండటం, ఆరు గ్యారెంటీ పథకాల ప్రభావం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా చేవెళ్ల పార్లమెంట్ పై దృష్టి పెట్టడం.. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్ని తానై వ్యహరించడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారిందనే చెప్పవచ్చు.

దీనికి తోడు పార్లమెంట్ పరిధిలో సంప్రదాయ ఓటు బ్యాంకు మైనార్టీలు ఉండటం కాంగ్రెపార్టీకి కలిసి వచ్చే అవకాశంగా ఆ పార్టీ భావిస్తుం ది. కేంద్రంలో మరోసారి మోదీయే హ్యాట్రిక్ ప్రధానిగా అవుతారంటూ ఊకదంపుడు ప్రచారం, అయోధ్యలో రామమందిరం నిర్మాణం, రాష్ట్రంలో ఎవరు ఉన్న కేంద్రంలో బీజేపీ ఉండాలనే మౌత్ టాక్ గ్రామాలకు పాకడం, ప్రధాని మోదీతో పాటు బీజేపీ చీఫ్ అమిత్‌షా, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ ముఖ్యనేతల పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేయడం బీజేపీ పార్టీకి కలిసివచ్చిందనే చెప్పవచ్చు. దీనికి తోడు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్థానికుడు కావడం, గత పార్లమెంటు ఎన్నికలో ఓడిపోవడంతో ఆయనకు సింపతి కలిసి వచ్చింది. 

బీఆర్‌ఎస్ పార్టీని చూస్తే  రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, కాంగ్రెస్, బీజేపీ జాతీయ పోరుగానే పార్లమెంట్ ఎన్నికలను ప్రజలు భావించడం, ఇరు పార్టీల అభ్యర్థులకు దీటుగా బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపిక చేయకపోవడం, ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలకు దీటుగా  ప్రచారం చేయకపోవడం, కేవలం బీసీ నినాదంతో ముందుకు పోవ డం బీఆర్‌ఎస్‌కు మైనస్‌గా మారింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు ప్రచారం చేసిన ఓటర్లను ఆకట్టుకోలేదని కొంత సమాచారం. ప్రధానంగా సెటిలర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందు కు ఆంధ్రాకు వలస వెల్లడం, ఏడు నియోజకవర్గాలలో ప్రధానంగా బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదాలాయింపు కావడం కూడా బీఆర్‌ఎస్‌కు మైనస్‌గా మారింది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ ఒక్కరోజుకు ముందే బీఆర్‌ఎస్‌కు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పోల్ మేనేజ్‌మెంట్ చేయకపోవడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 

కాంగ్రెస్, బీజేపీ పార్టీలో మాత్రం పోలిం గ్ రెండు రోజుల నుంచి పోలింగ్ రోజు వరకు పోటాపోటీగా పోల్‌మేనేజ్‌మేంట్ కార్యక్రమం చేపట్టారు. ఓటర్లకు మద్యం, పైసలు తాయిలాలు వెదజల్లారు. వీరికి దీటుగా బీఆర్‌ఎస్ నేతలు ఓటర్లను ప్రభావి తం చేయలేకపోవడం విశేషం. కొన్ని గ్రామా లు, పట్టణాలు, వార్డులో పోలింగ్ ఏజెంట్లు సైతం బీఆర్‌ఎస్‌కు చెందిన ఏజెంట్లు కూర్చోకపోవడం విడ్డూరం.

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 

ఏడు నియోజకవర్గాల వారీగా పర్సెంటేజ్ ఇలా ఉన్నాయి


నియోజకవర్గం పోలింగ్ శాతం

మహేశ్వరం 49. 77 శాతం

రాజేంద్రనగర్ 50.54 శాతం

శేరిలింగంపల్లి 41.70 శాతం

చేవెళ్ల        68.59 శాతం

పరిగి  62.59 శాతం

వికారాబాద్ 66.86 శాతం

తాండూరు 63.00 శాతం

ఓవరాల్‌గా పర్సెంటేజ్‌లు పరిశీలిస్తే వికారాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 66శాతం పోలింగ్ నమోదు కాగా శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యల్పంగా పోలింగ్ నమోదు అయింది.