calender_icon.png 6 October, 2024 | 6:56 PM

లిక్కర్ అమ్మితే 50వేల జరిమానా

06-10-2024 04:51:42 PM

గ్రామస్తుల తీర్మానం కార్యదర్శికి అందజేత

ఆదర్శ గ్రామంగా నిలువాలని గ్రామస్తుల నిర్ణయం

కామారెడ్డి (విజయక్రాంతి) : ఏ గ్రామంలో చూసినా పట్టణంలో చూసిన మద్యం అమ్మకాల జోరు కొనసాగుతున్న ఈ రోజుల్లో తమ గ్రామంలో మద్యం అమ్మకాలు చేపడితే 50 వేల జరిమానా కట్టాల్సిందేనని ఆదివారం గ్రామస్తులు తీర్మానం చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా ఆజామాబాద్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి గ్రామంలో యువకులు అతిగా మద్యం సేవిస్తుండడంతో ఇండ్లలో ఘర్షణలు తలెత్తుతుండడంతో గ్రామ పెద్దలు అందరు కలిసి గ్రామంలో మద్యం అమ్మకాలు చేపట్టా వద్దని చర్చించారు. వారితో పాటు యువకులు కూడా మద్యం అమ్మకాలు గ్రామంలో జరగనివ్వవద్దని తీర్మానం చేశారు. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలువాలని గ్రామస్తులు కంకణం కట్టుకున్నారు. అనుకున్నదే తడవుగా గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో మద్యం అమ్మకాలు చేపట్టవద్దని తీర్మానించి తీర్మానాన్ని గ్రామ కార్యదర్శికి అందజేశారు. గ్రామంలో మద్యం అమ్మకాలు చేపడితే 50000 జరిమానా విధించాలని తీర్మానించారు. ఈ కట్టుబాట్లు ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి మరి.