05-04-2025 12:08:16 AM
దెబ్బతిన్న 44 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు
రికార్డు సమయంలో పునరుద్ధరణ, అభినందించిన సీఎండీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4(విజయక్రాంతి) : నగరంలో గురువారం కురిసిన భారీ వర్షానికి గ్రేటర్‌లో 57విద్యుత్ స్తంభా లు కూలాయని, 44 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌ఫారుఖి తెలిపారు. శుక్రవారం తెల్లవారు జాము వరకు వాటిని రికార్డు స్థాయిలో తమ సిబ్భంది పునరుద్దరించారని, వారి సేవలను అభినందించారు. క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల పనితీరులో మార్పు వచ్చిందని, అత్యవసర పరిస్థితి ఎదురైనపుడు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తూ,ఎఫ్‌ఓసీ, సబ్‌స్టేషన్‌లను తనిఖీ చేస్తు న్నారన్నారు. రాబోయే రోజుల్లోనూ విపత్తులు తలెత్తినపుడు ఇదే స్ఫూర్తితో సమన్వ యంతో పని చేస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.