calender_icon.png 22 February, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి

18-02-2025 12:51:51 AM

చారకొండ, ఫిబ్రవరి 17: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు ద్వారా ఇండ్లు కోల్పోయిన బాధితులు నష్టపరిహారం కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఏడు రోజులుగా గ్రామస్థులు చేస్తున్న రిలే దీక్షలకు సోమవారం సిపిఐ జిల్లా నాయకులు గోపాల్ సందర్శించి మద్దతు తెలిపారు. 

ప్రభుత్వ 500 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలన్నారు.  ప్రభుత్వము పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ ప్రేమ్ కుమార్, సిపిఐ జిల్లా నాయకులు శ్రీనివాసులు, సిపిఎం నాయకులు ఏపీ మల్లయ్య, బాలస్వామి, ఆంజనేయులు, బాధితులు గుండె యాదమ్మ, చండూరు చిట్టెమ్మ, వెంకటయ్య, బాలయ్య, గుండె బాల్ నారి,  అలివేలు, విజయ, కిరణ్,  లింగం, అంజయ్య పాల్గొన్నారు.