20-04-2025 12:46:00 AM
అహ్మదాబాద్/జైపూర్, ఏప్రిల్ 19: ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ విజయాలు సాధించా యి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
అక్షర్ పటేల్ (39), అశుతోశ్ (37), స్టబ్స్ (31) రాణించారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ క్రిష్ణ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ 19.2 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది. బట్లర్ (97*), రూథర్ ఫోర్డ్ (43) జట్టును గెలిపించారు. కుల్దీప్, ముకేశ్ చెరో వికెట్ తీశారు. జైపూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది.
తొలు త లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మార్కరమ్ (66), బదోనీ (50) అర్థసెంచరీలు చేశారు. అనంతరం ఛేదనలో రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 178 పరుగు లకు పరిమితమైంది. జైస్వాల్ (74) రాణించాడు. ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. నేడు జరగనున్న డబుల్ హెడర్‌లో బెంగళూరుతో పంజాబ్, చెన్నైతో ముంబై తలపడనున్నాయి.