- రంజీ సీజన్
- సెంచరీతో మెరిసిన హైదరబాదీ
న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీ రంజీ సీజన్ రంజుగా సాగుతోంది. బుధవారం ఐదో రౌం డ్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. ఆంధ్రతో జరుగుతున్న పోరులో హైదరబాదీ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (124*) శతకంతో మెరిశాడు. చత్తీస్‌గఢ్ కెప్టెన్ డేనిష్ దాస్ (104), సౌరాష్ట్ర బ్యాటర్లు చిరాగ్ జానీ (153), హార్విక్ దేశాయ్ (99), బెంగాల్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ (92), రాజస్థాన్‌లో మహిపాల్ లామ్రోర్ (141), కార్తిక్ శర్మ (113).. బరోడాలో జ్యోష్నిల్ సింగ్ (121), శాశ్వత్ రావత్ (90*).. గుజరాత్లో విశాల్ జైస్వాల్ (110) తొలి రోజు సెంచరీలు చేసి..
తృటిలో చేజార్చుకున్న వారిలో ఉన్నారు. ఇక ఒడిషాతో పోరులో మహారాష్ట్ర 162.. కర్ణాటకతో మ్యాచ్‌లో యూపీ 89.. జమ్ముతో మ్యాచ్‌లో త్రిపుర 165.. హిమాచల్‌తో మ్యాచ్‌లో పాండిచ్చేరి 85.. బరోడాతో పోరులో మేఘాలయ 103 మాత్రమే చేసి ఆలౌట్ అయ్యాయి. కన్నడ బౌలర్ కౌశిక్ ఐదు, బరోడా బౌలర్ పితియా 6, జమ్ము బౌలర్ నబీ 6 వికెట్లు తీసుకున్నారు.