18-03-2025 10:42:21 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో దొండో పరిత్ దాదా ఆశిసులతో ప్రతి ఏటా హనుమాన్ మందిరం వద్ద శ్రీ అఖండ హరినామ సప్తహ కార్యక్రమం లక్ష్మణ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు అఖండ హరినామ సప్తహ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సప్తహ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి మహారాజులు పాల్గొంటారు. గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలు వివిధ గ్రామాల భక్తులు పాల్గొని భగవంతుని నామస్మరణతో భజన కార్యక్రమం ప్రవచనాలు ఆలకిస్తూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
మహిళలు ప్రతిరోజు ఏడు రోజులపాటు ఇంటినీ శుద్ధం సాన్పు అలుకూత చేసుకుని ప్రతిరోజు నియమంతో ఉంటారు. ఈనెల 17 నుంచి 24 వరకు సప్తహ కార్యక్రమం కొనసాగుతుంది. ముగింపు రోజున గోపాల కాలువలు ఊరు అందరూ కలిసి నిండు బిందెలతో కొత్త బట్టలు ధరించి భగవంతుని నామస్మరణ ప్రవచనాలు ఆలకిస్తు ఊర్లో ఊరేగింపు చేసి హనుమాన్ మందిరం వద్ద ఆధ్యాత్మిక చింతన భవంతుని విషయాలు ప్రవచనాలు తెలియజేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొంటారు.