calender_icon.png 8 January, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15 ఏళ్ల ప్రేమ.. నాకంటే ఏడేళ్లు పెద్ద

05-01-2025 12:30:40 AM

అలనాటి మేటి కథానాయిక సావిత్రిలా ఉందం టూ ‘మహానటి’ చిత్రంలో నటింపజేశారంటే కీర్తీ సురేశ్ అందచందాల గు రించి ఇక వర్ణించడా నికి ఏముంటుంది. నటన అం టారా? అదే చిత్రానికి జాతీ య ఉత్తమ నటి అవార్డును అందుకుంది కదా.. ఇక నటనకు పేరు పెట్టేదేముంటుంది? అలాం టి ముద్దుగుమ్మను వివాహం చేసుకున్న అదృష్టవంతుడు ఆంటోని తటిల్. 

తాజాగా కీర్తి సురేష్ తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. “నా పెళ్లి ఇప్పటికీ కలలానే అనిపిస్తోంది. భావోద్వేగాలతో నా హృదయమం తా నిండిన క్షణాలవి. ఈ గొప్ప క్షణాల కోసం కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్నాం. మేమిద్దరం 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచే ప్రేమించుకుంటున్నాం.

15 ఏళ్ల మా ప్రేమ  గురించి ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి తెలుసు. ఆంటోని నాకంటే ఏడేళ్లు పెద్ద. నా కెరీర్‌కు కావల్సినంత మద్దతు ఇస్తాడు. ఆయన నా జీవితంలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నా” అని కీర్తి సు రేష్ తెలిపింది.