03-04-2025 11:27:28 AM
రాళ్లతో కొట్టి చంపిన దుండగులు
అత్తాపూర్ పిఎస్ పరిధిలో
గోల్డెన్ సిటీలో ఘటన
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. రాళ్లతో మోది చంపేసిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్(Attapur Police Station) పరిధిలోని హసన్ నగర్ గోల్డెన్ సిటీలో గురువారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం.. మహమ్మద్ రహీం అనే బాలుడిని గుర్తుతెలియని దుండగులు రాళ్లతో కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని మీరాలం చెరువు సమీపంలో పడేశారు. సమాచారం అందుకున్న అత్తాపూర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.