35 కార్పొరేషన్లకు నూతన చైర్మన్లు
- రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించాలని సూచన
- సోమవారమే పదవులు చేపట్టిన కొందరు చైర్మన్లు
- రెడ్డి సామాజికవర్గానికే అత్యధికంగా 12 పదవులు
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం నామి నేటెడ్ పదవుల జాతరకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్చి 15వ తేదీనే జీవో విడుదలైంది. అయితే లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో బాధ్యతలు చేపట్టడం నిలిచిపోయింది. దీంతో గతంలో నియమించిన వారికి తిరిగి నియామకపు ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
ఎన్నికలు ముగిసిన తర్వాత తమకు నామి నేటెడ్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుపట్టారు. కార్పొరేషన్ చైర్మన్లలో కొందరిని మార్చాలని కాంగ్రెస్ పార్టీలో కొందరు డిమాండ్ చేయటంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిం చింది. తాజా ఉత్తర్వులో రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించాలని నియమితులైన నేతలకు సూచించింది. దీంతో కొందరు సోమవారమే బాధ్యతలు స్వీకరించగా, మరి కొందరు రెండు రోజుల్లో చైర్మన్లుగా బాధ్యతలు తీసుకోకున్నారు.
టికెట్లు త్యాగం చేసిన వారికి అవకాశం
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినవారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం దక్కింది. వారిలో సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్‌రెడ్డి, ఎల్బీనగర్‌కు చెందిన మల్‌రెడ్డి రామిరెడ్డి, బాన్సువాడలోని కాసుల బాలరాజు, ఖమ్మంకు చెందిన రాయల నాగేశ్వర్‌రావు, గోషామహల్ నేత మెట్టు సాయికుమార్, వరంగల్ పశ్చిమ నాయకుడు జంగా రాఘవరెడ్డి, తాండూరు నుంచి కాల్వ సుజాత, బాల్కొండ నేత ఈరావత్రి అనిల్, మహబూబాబాద్ నాయకుడు బెల్లయ్యనాయక్, వనపర్తికి చెందిన శివసేనారెడ్డి, అంబర్‌పేట నేత నూతి శ్రీకాంత్‌గౌడ్, తుంగతుర్తి నుంచి ఎన్ ప్రీతమ్, రామగుండం నేత జనక్‌ప్రసాద్, మహేశ్వరం నాయకుడు చల్లా నరసింహారెడ్డి, శేరిలింగంపల్లి నాయకుడు జెరిపెట్టి జైపాల్‌కు నామినేటెడ్ పదవులు కేటాయించారు. వీరిలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు కూడా ఉన్నారు.
రెడ్లకే అధికం
నామినేటెడ్ పదవుల పందేరంలో రెడ్డి సమాజికవర్గానికే పెద్ద పీట వేశారు. 35 కార్పొరేషన్ల చైర్మన్లలో 12 రెడ్డి సామాజికవర్గానికే దక్కాయి. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు 10 పదవులు ఇచ్చారు. కమ్మ సామాజికవర్గం వారికి ౪, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, ఎస్సీలకు ఒక్కొక్కటి దక్కింది. ఎస్టీలకు మూడు, మైనార్టీలకు మూడు పదవులు ఇచ్చారు.
కార్పొరేషన్ చైర్మన్ పేరు సామాజికవర్గం
విత్తనాభివృద్ధి సంస్థ అన్వేష్‌రెడ్డి ఓసీ
ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ కాసుల బాలరాజు బీసీ
ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ జంగా రాఘవరెడ్డి ఓసీ
రాష్ట్ర సహకార సంఘం మానాల మోహన్‌రెడ్డి ఓసీ
గిడ్డంగుల సంస్థ రాయల నాగేశ్వరరావు ఓసీ (కమ్మ)
ముదిరాజ్ కార్పొరేషన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీసీ
మత్స్య సహకారం సమాఖ్య మెట్టు సాయికుమార్ బీసీ
గ్రంథాలయ పరిషత్ ఎండీ రియాజ్ మైనార్టీ
అటవీ అభివృద్ధి సంస్థ పొదెం వీరయ్య ఎస్టీ
ఆర్యవైశ్య కార్పొరేషన్ కాల్య సుజాత ఆర్యవైశ్య
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గుర్నాథ్‌రెడ్డి బీసీ (బలిజ)
సెన్‌విన్ సంస్థ ఎన్ గిరిధర్‌రెడ్డి ఓసీ
కనీస వేతనాల సలహాబోర్డు జనక్‌ప్రసాద్ బ్రాహ్మణ
నీటిపారుదల అభివృద్ధి సంస్థ మువ్యా విజయ్‌బాబు ఓసీ (కమ్మ)
హస్తకళల అభివృద్ధి సంస్థ నాయుడు సత్యనారాయణ ఓసీ (కమ్మ)
ఖనిజాభివృద్థి సంస్థ ఈరావత్రి అనిల్ బీసీ
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి బీసీ
వాణిజ్య ప్రోత్సాహక కార్పొరేషన్ అనితాప్రకాశ్‌రెడ్డి ఓసీ
సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ మన్నె సతీష్‌కుమార్ ఓసీ (కమ్మ)
పట్టణ ఆర్థిక మౌళిక సదుపాయాలు చల్లా నరసింహారెడ్డి ఓసీ
శాతవాహణ పట్టణాభివృద్ధి సంస్థ కే నరేందర్‌రెడ్డి ఓసీ
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఈ వెంకట్‌రామిరెడ్డి ఓసీ
రహదారి అభివృద్ధి సంస్థ మల్‌రెడ్డి రామిరెడ్డి ఓసీ
పర్యాటక అభివృద్ధి సంస్థ పటేల్ రమేష్‌రెడ్డి ఓసీ
తెలంగాణ ఫుడ్స్ ఎంఏ ఫహీమ్ మైనార్టీ
మహిళా సహకార అభివృద్ధి సంస్థ బండ్రు శోభారాణి ఓసీ
రాష్ట్ర వికలాంగుల సహకార అభివృద్ధి ముత్తినేని వీరయ్య బీసీ
స్పోర్ట్స్ అథారిటీ శివసేనారెడ్డి ఓసీ
సంగిత నాట్య అకాడమీ అలేఖ్య పుంజాల బీసీ
ఎస్సీ కార్పొషన్ ఎన్ ప్రీతం ఎస్సీ
బీసీ కార్పొరేషన్ నూతి శ్రీకాంత్‌గౌడ్ బీసీ
ఎస్టీ కార్పొరేషన్ బెల్లయ్య నాయక్ ఎస్టీ
గిరిజన కార్పొరేషన్ కే తిరుపతి ఎస్టీ
ఎంబీసీ కార్పొరేషన్ జెరిపెట్టి జైపాల్ బీసీ
మైనార్టీ కార్పొరేషన్ ఎంఏ జబ్బార్ మైనార్టీ