calender_icon.png 16 January, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.15 లక్షల కోట్లు ఆవిరి

06-08-2024 03:36:03 AM

  1. రూ.442 లక్షల కోట్లకు పతనమైన కంపెనీల విలువ 
  2. అమెరికా ఆర్థిక మాంద్యం భయాలు 
  3. భారీ నష్టాల్లో ఆసియా మార్కెట్లు 
  4. సెన్సెక్స్ 2,200 పాయింట్లు పతనం 
  5. 24 వేల పాయింట్ల స్థాయికి నిఫ్టీ 
  6. కనిష్ఠ స్థాయికి రూపాయి 
  7. దలాల్ సేల్‌కు ‘బ్లాక్ మండే’

ముంబయి: సెన్సెక్స్ ఉదయం 78,588.19 పాయింట్ల వద్ద (క్రితం ముగిం పు 80,981) పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,295 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ.. చివరికి 2,222.55 పాయింట్ల నష్టంతో 78,759.40 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 662 పాయింట్ల నష్టంతో 24,055 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.02గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగడం గమనార్హం. టాటా మోటార్స్ (7.32%), అదానీ పోర్ట్స్ (5.93%), టాటా స్టీల్ (5.31%), ఎస్‌బీఐ (4.34%), పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (4.19%) ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75.35 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,465 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది.

భౌగోళిక ఉద్రిక్తతలు

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం ఎప్పుడు భగ్గుమం టుందోనని మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. సోమ వారమే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయొచ్చని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ జీ7 దేశాలకు సమాచారమిచ్చారు. చమురుకు కేంద్రమైన పశ్చిమాసియాలో నెలకొ న్న ఈ యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏ రూపం దాలుస్తుందోనని ప్రపంచ దేశాలు భయభ్రాంతులకు గురవుతున్నాయి.

కనిష్టస్థాయికి రూపాయి

ఈ ఏడాది ప్రారంభంలో ఆసియాలో అత్యత్తమ పనితీరు కనబరుస్తున్న బారతీయ కరెన్సీ రూపాయి సోమవారం అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయింది. సోమవరం మధ్యా హ్నం సమయానికి అమెరికా డాలరుతో రూపాయి 83.85కు చేరుకుంది. మున్ముందు 84కు చేరుకున్నా ఆటశ్చర్యం ఏదని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారంనుంచి మూడు రోజలు పాటు జరగనున్న ద్రవ్య విధానం సమీక్షలో రిజర్వ్ బ్యాంక్  అనుకూల వైఖరికి సబంధించిన సంకేతాలు ఏవయినా ఉంటే రూపాయి విలువ పెరిగే అవకాశం ఉం దని నిపుణులు భావిస్తున్నారు.  ఈ ఏడాది మార్చిలో గరిష్ఠ స్థాయినుంచి రూపాయి విలువ  ఇప్పటివరకు 1.3 శాతం తగ్గింది.