calender_icon.png 29 April, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్క కాటుతో 15 మంది పిల్లలకు గాయాలు

29-04-2025 01:15:25 AM

ఒక బాబుకు సీరియస్ సూర్యాపేటకు తరలింపు

కరిసిన కుక్కను పట్టుకున్న మున్సిపల్ సిబ్బంది, కాలనీ ప్రజలు

కోదాడ, ఏప్రిల్ 28: కోదాడ పట్టణంలోని గణేష్ నగర్, తిలక్ నగర్, సాయి నగర్ లో ఒక వీధికుక్క సంచరిస్తూ 15 మంది చిన్నపిల్లలను కాటు వేసింది. కుక్క కాటులో వర్షిత్ (3) బాబుకు ఎక్కువ గాయాలు కావడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా పిల్లలను కోదాడ ఏరియా ఆసుపత్రిలో తల్లితండ్రులు చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లారు. వీధి కుక్కల దాడిలో పిల్లలకు గాయాలయ్యాయని కర్రీ సుబ్బారావు చరవాణి ద్వారా మున్సిపల్ అధికారులకు తెలియపరచగా, శానిటరీ ఇంచార్జ్ ఎస్త్స్ర చలగంటి రాజయ్య స్పందించి వార్డు జవాన్లను పిలిపించి మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసుల సహకారంతో విధి కుక్కను పట్టుకున్నారు.

ఆరు బయటనే పిల్లలు ఆడుకుంటున్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఆరు బయటనే ఆడుకుంటున్నారు. వీధి కుక్క ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ బయట ఆడుకుంటున్న పిల్లల మీదకి ఒకసారి వచ్చి కరిసింది. దీంతో పిల్లలు అరుస్తూ పరుగులు తీశారు. ఒక కాలనీలో కుక్కను వెంబడిస్తే మరో కాలనీలో ఉన్న పిల్లలను కరుస్తూ పరుగులు తీసింది. మున్సిపల్ అధికారులు కాలనీ ప్రజల సహకారంతో కుక్కను పట్టుకున్నారు..

కుక్కలతో భయభ్రాంతులకు గురవుతున్న కోదాడ ప్రజలు

వాహనాల మీద రాత్రి వేళల్లో బయటికి వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తుంది. వాహనాలపై వెళ్లేటప్పుడు వీధి కుక్కలు వెంబడిస్తున్నాయని  పట్టణవాసులు భయభ్రాతలు గురి అవుతున్నారు.. ఇకనైనా మున్సిపల్ అధికారుల స్పందించి ఇది కుక్కలను పట్టుకోవాలని కోరారు.

వీధి కుక్కలను పట్టిస్తాం: శానిటరీ ఇంచార్జ్ ఎస్‌ఐ చలగంటి రాజయ్య

కోదాడలో వీధి కుక్కలు సంచరిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి కుక్కలను పట్టించే విధంగా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే కోదాడలో వీధి కుక్కలు లేకుండా చేస్తాం..