06-03-2025 05:49:31 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గిరిజన క్రీడ పాఠశాలల ఎంపిక పోటీలు గురువారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడ బాలికల పాఠశాల మైదానంలో హోరాహోరీగా జరిగాయి. ఏడు విభాగాలలో నిర్వహించిన క్రీడలకు 169 మంది పిల్లలు హాజరయ్యారు. జిల్లాస్థాయిలో జరిగిన ఈ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన పిల్లలు ఉమ్మడి జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి తెలిపారు. ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీలు బాలురులకు ఈనెల 10న ఉట్నూరులో, నెల 12న బాలికలకు ఆసిఫాబాద్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
హైదరాబాద్ లోని బోయినపల్లిలో ఉన్న వాటర్ స్పోర్ట్స్ అకాడమీకి 20 మంది క్రీడాకారులను ఎంపిక పోటీలకు పంపించడం జరుగుతుందని గిరిజన క్రీడా అధికారి బండ మీనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిఎంఓ ఉద్ధవ్, జిసిడివో శకుంతల, ఏటిడిఓ చిరంజీవి, క్రీడా పాఠశాల హెచ్ఎం జంగు, మనోహర్, పేట సెక్రటరీ కృష్ణమూర్తి, కోచ్ లు విద్యాసాగర్, తిరుమల్, వ్యాయామ ఉపాధ్యాయులు బిక్కు, శేకు, వనిత, కనక వెంకటేష్, రాజేంద్రప్రసాద్, సుందర్ సింగ్, అరవింద్, మంగవతి, తదితరులు పాల్గొన్నారు.