calender_icon.png 22 November, 2024 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్రెయిన్‌పై భీకర దాడి

22-11-2024 02:35:29 AM

ఖండాంతర క్షిపణి ప్రయోగం

  1. ఉక్రెయిన్ వాయుసేన ప్రకటన
  2. దాడిపై స్పందించని రష్యా

న్యూఢిల్లీ, నవంబర్ 21: ఉక్రెయిన్-రష్యా యుధ్దం తారాస్థాయికి చేరుకుంది. రష్యా తొలిసారిగా ఉక్రెయిన్‌పై ఖండాంతర క్షిపణితో దాడి చేసింది. 5వేల కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను తుదముట్టించగల ఖండాంతర క్షిపణిని రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వాయుసేన ప్రకటించింది.

గురువారం తెల్లవారుజామున డెనిపర్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడి చేసినట్టు వివరించింది. ఈ దాడిలో భారీ నష్టం సంభవించడంతోపాటు పలు భవనాలు కూలిపోయాయని తెలిపింది. అయితే దాడి చేయడానికి రష్యా ఉపయోగించిన క్షిపణి రకాన్ని గురించిన స్పష్టతను మాత్రం ఇవ్వలేదు. ఖండాంతర క్షిపణితోపాటు ఎక్స్ కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ పేర్కొంది.

ఈ దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.  కాగా, ఉక్రెయిన్ ఆరోపణలపై రష్యా స్పందించలేదు. ఈ విషయంపై చెప్పడానికి ఏమీ లేదనీ, ఏమైనా ప్రశ్నలు అడగదల్చుకుంటే తమ సైనికులను అడగాలని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.