calender_icon.png 16 January, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసాపై క్షేత్ర పర్యటన

06-07-2024 01:37:03 AM

  1. 11 నుంచి 16 వరకు జిల్లాల్లో టూర్లు
  2. రైతులు, నిపుణులతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు
  3. ఆ తర్వాతే పథకం విధివిధానాలు ఖరారు
  4. సచివాలయంలో ఉపసంఘం భేటీ.. పథకంపై చర్చ

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): రైత భరోసా పథకంపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలకు వెళ్లి రైతులు, నిపుణులతో చర్చించనున్నారు. రైతు భరోసాపై ఏర్పాటైన క్యాబినెట్ కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  ఈ పథకంపై చర్చించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రైతుభరోసా విధివిధానాలు, అర్హతలను ఖరారు చేయాలని ఉపసంఘం అభిప్రాయపడింది. కౌలు రైతులకు రైతు భరోసా ఎలా ఇవ్వాలనే అంశంపై కూడా రైతు సంఘాలు, నిపుణులతో చర్చంచనున్నారు. ఈ నెల 16న మరోసారి సమావేశమై విధివిధానాలు ఖరారు చేసి అసెంబ్లీలో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.