10-04-2025 09:02:40 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పొలిటికల్ సైన్స్ విద్యార్థులు కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలు సమ్మక్క ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి తహసిల్దార్ ఆఫీసులో ఫీల్డ్ ట్రిప్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తహసిల్దార్, పౌరుల హక్కులు, విధులు, చట్టాలు గురించి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణలోని వివిధ అంశాలపై సందేహాలను తహసిల్దార్ జ్యోత్స్నను అడిగి అవగాహన పొందారు.
ఈ ఫీల్డ్ ట్రిప్ వల్ల తమ జ్ఞానాన్ని ఆచరణలో ఎక్కువ అవగాహన చేసుకోవడం జరిగిందని విద్యార్థులు తెలిపారు. అవగాహన పెంపు కోసం ఫీల్డ్ ట్రిప్ కు వచ్చిన విద్యార్థులకు తహసిల్దార్ జ్యోత్స్న తగిన అవగాహన కల్పించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నివృత్తిగా తగిన సమాచారాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల పొలిటికల్ సైన్స్ అల్లం తిరుపతి విద్యార్థులు, డిప్యూటీ తహసిల్దార్ కల్పన, రెవెన్యూ నాయబ్ తహసిల్దార్ అధికారులు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.