నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం ఈనెల 26 నుంచి కొత్త పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని జిల్లా రెవిన్యూ అదన కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారం కడెం దస్తురాబాద్ మండలాలు రెవెన్యూ వ్యవసాయ శాఖ సిబ్బంది చేస్తున్న సర్వేలు పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి సాగు చేసుకోండి రైతులకు మాత్రమే అందించాలని కోరారు. ఈ రెండు మండలాలు 100 ఎకరాలకు పైగా పెట్టుబడి సాయం అర్హత లేని భూములను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.