calender_icon.png 19 January, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20వ లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి

19-01-2025 12:00:00 AM

కలెక్టర్  క్రాంతి వల్లూరు గుమ్మడిదల మండలంలో ఫీల్ వెరిఫికేషన్ ప్రక్రియ తనిఖీ చేసిన కలెక్టర్

గుమ్మడిదల, జనవరి 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ఫీల్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు.

గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో సర్వే బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును తనిఖీ చేశారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు అవలంభిస్తున్న విధానాలను, సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ పరిశీలించారు.

క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సేకరించిన వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ సర్వే సిబ్బందిని ఆదేశించారు. త్వరితగతిన ఫీల్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.