22-04-2025 12:34:56 AM
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 21 ( విజయ క్రాంతి ): ఫీల్ అసిస్టెంట్ రాష్ట్ర కమిటి ఐ ఎన్ టి యు సి పిలుపుమేరకు ఫీల్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు బబ్బూరి శంకర్ ఆధ్వర్యంలో రాయిగిర్ కమాన్ నుండి కలెక్టరేట్ వరకు ఫీల్ అసిస్టెంట్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారి జగన్మోహన్ రెడ్డి, డిఆర్డి ఏ నాగిరెడ్డికీ వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా యూనియన్ జనరల్ సెక్రెటరీ ఆర్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫీల్ అసిస్టెంట్లకు గత మూడు నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే మనకు రావాల్సిన జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే కనీస వేతన చట్టం ప్రకారం 25 వేల జీతం ఇవ్వాలని కోరుతూ ఫీల్ అసిస్టెంట్లకు హెల్త్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మరియు ఫీల్ అసిస్టెంట్ విధి నిర్వహణలో మరణిస్తే 15 లక్షల ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని కోరారు అలాగే 4779 జిఓ ప్రకారం తొలగించిన ఫీల్ అసిస్టెంట్లను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంకల జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి,సిద్దిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బైరగోని రమేష్ కోశాధికారి జెర్రిపోతుల ఉపేందర్ నరేందర్ రామచందర్ బింగి నర్సింహా రవి వెంకటేష్ సుధాకర్ కూమార్ శ్రీను రజిత సునీత వాణి లక్ష్మి వివిధ మండలాల ఫీల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.