ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పాయల్ రాజ్ పుత్. ఈ బ్యూటీ ఒకవైపు కథాబలమున్నా సినిమాలు చేస్తూ.. మరోవైపు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకుంటోంది. తాజాగా పాయల్ బీచ్ వెకేషన్ ఫోటోలతో అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. తన అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. మెరూన్ బికినీ వేసుకొని ఈత కొడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. వరుస ఫెయిల్యూర్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిన ఈబ్యూటీ ‘మంగళవరం’ మూ వీతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. త్వరలోనే ఆమెను మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.