10-04-2025 01:57:03 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, ఏప్రిల్9 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా పండుగలు నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం ఇస్లాంపూర్ లో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం ఉప్పరమల్యాల లో నిర్వహించిన పోచమ్మ బోనాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నెత్తిన బోనమెత్తి గ్రామస్తులతో కలిసి పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,ముద్దం జమున నగేష్ ,వంగ శ్రీధర్ గౌడ్, దోమకొండ మహేష్,కర్ర బాపు రెడ్డి, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దీకొండ మధు, పెంచాల చందు, ముచ్చె శంకర్, తదితరులు పాల్గొన్నారు.