కరీంనగర్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): భక్తులు గణేశ్ నవరాత్రి ఉత్సవాల ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మానకొండూరు చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన వందలాది గణేశ్ విగ్రహాలు మానకొండూరు, కొత్తపల్లి చెరువులు, చింతకుంట కెనాల్‌లో నిమజ్జనం చేయాలన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.