calender_icon.png 2 April, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండగలు కలిసిమెలిసి జరుపుకోవాలి

31-03-2025 01:12:09 AM

ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు

ఆదిలాబాద్, మార్చి 30 (విజయక్రాం తి): కుల మతాల భేదం లేకుండా అందరూ పండగలను కలిసిమెలిసి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థాని క శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలకు జిల్లా ఎస్పీ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఎస్పీ దపంతులకు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. ముందుగా మఠాధిపతి శ్రీ యో గానంద సరస్వతి స్వామితో కలిసి ఆలయం లో ఎస్పీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా సుఖ సంతోశాలతో, ఆయురాగోగ్యలతో ఉండాలని ఆకాంక్షించా రు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సునీల్ కుమార్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి,  సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి గెడం మాధవ్, కోశాధికారి పడకంటి సూర్యకాంత్,  సమితి కార్యనిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, సంజీవ్, రాజు  తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సోమవారం జరిగే రం జాన్ పండగ  సందర్భంగా ఆదిలాబాద్ లో ని ఈద్గా మైదానాన్ని ఎస్పీ పరిశీలించారు. మైదానంలో ముస్లింలు ప్రార్థన చేసే ప్రాం తాన్ని డిఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సునీల్ కుమా ర్‌తో కలిసి పరిశీలించి అక్కడ ఏర్పాట్లపై ఆరా తీశారు. ప్రార్థన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.