26-03-2025 12:44:52 AM
-శంషాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ రామ్‌కుమార్
రాజేంద్రనగర్, మార్చి 25 (విజయ క్రాంతి): మతాలకు అతీతంగా అందరూ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని శంషాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ తెలియజేశారు. త్వరలో రాబోయే రంజాన్ పండుగ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో డీసీపీ జోన్ పరిధిలోని ఆయా ఠాణా ల ఇన్స్పెక్టర్లు, ముస్లిం సంఘాల మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు. హిందూముస్లింలు అన్నదమ్ముల వంటి వారిని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. పండుగల సమయంలో అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. ఎలాంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్.జి ఐ ఏ ఇన్స్పెక్టర్ బాలరాజు, శంషాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, కొత్తూరు, నందిగామ ఇన్స్పెక్టర్లు పోలీసు అధికారులు ముస్లిం సంఘాల మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.