calender_icon.png 31 March, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలి: డీసీపీ భాస్కర్

28-03-2025 01:17:05 PM

మంచిర్యాల,(విజయక్రాంతి) : ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. షబ్ ఎ ఖద్ర్ - జాగ్ నేకి రాత్ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి ముస్లిం సోదరులతో మాట్లాడి ప్రశాంతమైన వాతావరణంలో పండగలను కలిసి జరుపుకోవాలని, ఒకరిని మరొకరు గౌరవించి, మత సామరస్యాన్ని చాటాలని డీసీపీ సూచించారు. అనంతరం మంచిర్యాల రైల్వే స్టేషన్, పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి విధి నిర్వాహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతల సమస్యల తలెత్తడానికి ఏవైనా అవకాశం ఉంటే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదని, అట్టి వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.