26-02-2025 01:09:39 AM
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో సామరస్యంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భావన సమావేశ మందిరంలో అదనపు ఎస్. పి. ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి మండలాల తహసిల్దార్లు, విద్యుత్, మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు,
ముస్లిం మత పెద్దలు, మస్జిద్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసమును ప్రశాంత వాతావరణంలో అందరూ పవిత్రంగా జరుపుకోవాలని అన్నారు. పండుగలను సంయమనంతో భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాం, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేష రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య, తాసిల్దార్ రోహిత్ కుమార్, ముస్లిం మత పెద్దలు, మస్జిద్ కమిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.