calender_icon.png 1 April, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో పండుగలు

27-03-2025 12:20:58 AM

 సీఐ శివప్రసాద్ 

కడ్తాల్, మార్చి 26 ( విజయ క్రాంతి ) : ఉగాది, రంజాన్ పండుగలు ప్రజలు ప్రశాం త వాతావరణంలో జరుపుకోవాలని కడ్తాల్ సీఐ శివప్రసాద్ సూచించారు. బుధవారం కడ్తాల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ శివప్రసాద్ మాట్లాడుతూ రంజాన్ ఉగాది పర్వదినాలు  ప్రజ లు సంతోషంగా జరుపుకోవాలని అందరూ ఐక్యంగా మెలగాలని ఈ ప్రాంతంలో హిందూ ముస్లింలు ఎంతో ఆప్యాయంగా ఉంటారని స్నేహపూర్వక వాతావరణం నెలకొని ఉంటుందని   సీఐ తెలిపారు. .పండు గల సమయంలో ఇరువర్గాల నాయకులు ఒకరినొకరు గౌరవించు కుంటు  పండుగలు జరుపుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో పీస్ కమిటీ సభ్యులు, రాజకీయ  నాయకులు, ముస్లిం సోదరులు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.