calender_icon.png 6 March, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఘనంగా కొనసాగుతున్న ఉత్సవాలు

05-03-2025 08:47:20 PM

మాడ వీధుల్లో పెద్ద శేష వాహనంపై స్వామి వారి ఊరేగింపు..

ఉత్సవాల్లో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు..

బాన్సువాడ (విజయక్రాంతి): బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులోని "తెలంగాణ తిరుపతి తిరుమల దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు బుధవారం కార్యక్రమంలో పూజ, యజ్ఞంలో సతీసమేతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి-పుష్ప దంపతులు పాల్గొన్నారు. పోచారంతో కలిసి యజ్ఞంలో పాల్గొన్న పోచారం కుటుంబ సభ్యులు, పోచారం శంభురెడ్డి-ప్రేమల, పోచారం సురేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. 

ఉదయం నుంచి శ్రీశ్రీశ్రీ దేవనాధ రామానుజ జీయర్ స్వామి వారిచే తీర్థ గోష్ఠి, శ్రీ విష్వక్సెన అరాధనం పుణ్ణ్యహవచనం, యాగశాల ప్రవేశం అగ్నిప్రతిష్టాపనతో హోమం, చతుస్తానార్చనం, ధ్వజారోహణం, బలిహారణం, పూర్ణాహుతి అనంతరం మాడవీధుల్లో పెద్ద శేష వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం అనంతరం మాడవీధుల్లో పెద్ద సింహ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు.