calender_icon.png 1 April, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు

29-03-2025 11:33:19 PM

నారాయణ పేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి..

నారాయణపేట (విజయక్రాంతి): పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు అని, కుల మతాలకు అతీతంగా వాటిని జరుపుకోవాలని నారాయణ పేట డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి అన్నారు.  తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే పర్నికా రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నారాయణ పేట జిల్లా కేంద్రంలోని మెట్రో ఫంక్షన్ హాల్ లో  పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దావత్ - ఈ - ఇఫ్తార్  విందు  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ..   మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు  ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించడం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులందరికీ  ఆమె శుభాకాంక్షలు.  ఇఫ్తార్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఖర్జూర, పండ్లు తినిపించారు.

అనంతరం పట్టణానికి చెందిన ముస్లిం సోదరులతో  ఎమ్మెల్యే పర్నికా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్ చార్జీ కుంభం శివ కుమార్ రెడ్డి లు కలసి ఇఫ్తార్ విందులో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివారెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్ కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎం.ఏ. రషిద్, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి. అబ్దుల్ ఖలీల్, తహాసిల్దార్ అమరేంద్ర రాజు, సీ ఐ శివ శంకర్, ఆర్టీవో మెంబర్ పోషల్ రాజేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం, తఖీ బాబా దర్గా పీఠాధిపతి గయాసోద్దీన్ ఖాద్రి, ముస్లిం మత పెద్దలు అమీరోద్దీన్, మోసిన్ బాబా,  సర్ఫ రాజ్ అన్సారి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు  కొల్లంపల్లి గౌస్, రహమాన్ చాంద్, మహమూద్ ఖురేషి, యూసుఫ్  తాజ్, జలీల్ బేగ్, మాజీద్ పాషా, పార్టీ పట్టణ ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు.