వనపర్తి (విజయక్రాంతి): మన సంస్కృతికి సాంప్రదాయాలకు ఆనవాలైన పండగలు మతసామరస్యానికి ప్రతీకలని పండగలు నిర్వహించుకోవడం వల్ల మనుషుల మధ్య ఐక్యత నెలకొంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించుకునే "మిలాద్ ఉన్ నబి" సందర్భంగా సోమవారం వనపర్తి పట్టణంలోని గాంధీచౌక్ లో గల మహమ్మదీయ మసీదులో చేపట్టిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొని ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అందుకు సానుకూలంగా స్పందించి ఆయన త్వరలోనే సమస్యలు పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్లచందర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, అబ్బుభాకర్ బీన్ మహమ్మద్, అబ్బు ఖాసిం, తస్లీమ్, అస్లాబీన్ ఇస్మాయిల్, కౌన్సిలర్లు ఎల్ఐసి కృష్ణ భాషా నాయక్ నక్క రాములు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.