- మంత్రి జూపల్లి కృష్ణారావు
- పరేడ్ గ్రౌండ్‌లో కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ ప్రారంభం
- 19 దేశాలు, 14 రాష్ట్రాల నుంచి పాల్గొన్న కైట్ ఫ్లయర్స్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13(విజయక్రాంతి): పండుగలు మన సంస్కృతీ వారసత్వానికి ప్రతీకలని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన నగరంలోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. యువత అవుట్ డోర్ గేమ్స్ మరిచి, ఇన్‌డోర్ గేమ్స్ ఆడుతూ, సెల్‌ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంస్కృతిక పునరుజ్జీవనం, జీవన విధాన సంరక్షణకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.
‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే టూరిజం ప్రచారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాల ని పిలుపునిచ్చారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కైట్ , స్వీట్ ఫెస్టివల్ గతేడాది కంటే బాగా జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్యక్రమానికి ౧౯ దేశాలు, ౧౪ రాష్ట్రాల కైట్ ఫ్లయర్స్ హాజర కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, స్మితాసబర్వాల్ పాల్గొన్నారు.