calender_icon.png 30 March, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగలు సోదరభావానికి ప్రతీకలు

26-03-2025 10:59:20 PM

టీపీసీసీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పండుగలు సోదరభావానికి ప్రతీకలు అని టీపీసీసీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం రాయిచూర్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఆయన రంజాన్ ఉపవాస దీక్ష ఉన్న ముస్లింలకు ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. పలువురికి ఆయన ఖజూర్, పండ్లు తినిపించారు. అనంతరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తారు విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కులమతాల కతీతంగా అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకుందామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, లక్ష్మణ్, పీర్ సాధిక్, షేక్ ఉమర్, శ్యాంబాబు, రమాకాంత్, శ్యాంసుందర్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.